PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లిం సోదర,సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు – ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు  : శ్రీశైలం నియోజక వర్గం ముస్లీం సోదరులకు ఎమ్మేల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి  బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లీంలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారన్నారు. భక్తి భావం,కరుణ,సహనాన్ని బక్రీద్ చాటి చెబుతుందని. త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారని. మహ్మద్ ప్రవక్త బోధనలు,విధానాలు అందరికీ అనుసరణీయమని తెలిపారు. బక్రీద్ దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం,పేదల పట్ల సాయం, ఇతరుల పట్ల సోదర భావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.అల్లాహ్ దయతో  ప్రజలందరూ ఆరోగ్య,సుఖ శాంతులతో జీవించాలని, అందరికీ ఆ అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్బంగా ముస్లిం సోదర,సోదరీమణులకు ఎమ్మేల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి  బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

About Author