ముస్లిం సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు
1 min readరాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,ఆహార పరిశుద్ది శాఖా మంత్రి టి.జి. భరత్ మరియు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులకు,వారి కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం,ఆహార పరిశుద్ది శాఖా మంత్రి శ్రీ టి. జి. భరత్ మరియు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన జిల్లా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ముస్లింల ఆరాధ్య గ్రంథం దివ్య ఖురాన్ ప్రకారం సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి మానవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే పండగ బక్రీద్ అని, ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగ దాన గుణానికి, త్యాగానికి ప్రతీక అని వారు తెలిపారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.