ఘనంగా స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి :డోన్ పట్టణములో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో స్థానిక కార్యాలయములో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా డోన్ నియోజకవర్గ సమన్వయ కర్త (ఇంచార్జి )డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి, &డిసిసి ఉపాధ్యక్షులు యు.జనార్దన్, మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరగాంధీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని,ఇందిరమ్మ రాజ్యం లో భారత దేశంలో ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇందిరాగాంధీ లేకుంటే బంగ్లాదేశ్ అనే దేశమే ఉండేది కాదు అని,ఈ రోజు బంగ్లాదేశ్ ప్రజల కోసం, బంగ్లా దేశం విముక్తి కోసం ఇందిరమ్మ చేసిన ధైర్యసాహసాలు ఇక మరెవరూ చేయలేదని ఈ భూప్రపంచం మీద బంగ్లాదేశ్ అనే దేశం ఉన్నంతకాలం ఇందిరమ్మ వాళ్ళ గుండెల్లో బతికే ఉంటారు.అని వారు కొనియాడారు, అంతే కాకుండా భారత రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఒక శకానికి సంకేతం. దేశ ఆర్థిక,సామాజిక,రాజకీయ రంగాలపై ఆమె ప్రభావం తీవ్రమైనవి మరియు మరువలేనివి,బ్యాంకులు జాతీయకరణ, 20 సూత్రాలుపధకం,బంగ్లాదేశ్ విముక్తి, భారీ పరిశ్రమలు ఆమె కీర్తిని ఇనుమడింప జేశాయి..బలహీనవర్గాల బాంధవిగా, తెగింపు చొరవ సాహసం కలబోసుకున్న నేతగా,ఉక్కుమహిళగా ఇందిరాగాంధీ భారత రాజకీయాల్లో సుస్థిరస్తానం సంపాదించుకున్న రని ఆమెను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ సమన్వయ కర్త (ఇంచార్జి )డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి, & డిసిసి ఉపాధ్యక్షులు యు.జనార్దన్,లీగల్ సెల్ న్యాయవాది పి. జీవన్ బాబు,డోన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే రాజశేఖర్, డోన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వై.శేఖర్ యాదవ్,పి హనుమాన్ ,తదితరులు పాల్గొన్నారు.