ఘనంగా జాతీయ పత్రిక దినోత్సవం
1 min readసీనియర్ జర్నలిస్టులకు సన్మానం
సమాజ అభివృద్ధిలో జర్నలిస్టులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు
ఏపీడబ్ల్యూజే నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సమాజ అభివృద్ధిలో వారధిగా జర్నలిస్ట్ లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఐజేయూ కార్యవర్గ సభ్యులు జి.వి.ఎస్ ఎన్ రాజు, ఎపీయూడబ్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షులు కాగిత మాణిక్యరావు పేర్కోన్నారు. జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కమిటీ, ఎలక్ట్రానిక్ మీడియా, సామ్నా ల ఆధ్వర్యంలో అ శనివారం స్థానిక రెవెన్యూ భవన్ లో సీనియర్ జర్నలిస్టులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఐజేయూ, రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సంక్షేమానికి ఎపీయూడబ్యుజె సుదీర్ఘ పోరాటల చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో వివక్షతతో కనీసం అక్రిడేషన్ కార్డులు కూడా మంజూరు కాక అనేక ఇబ్బందులు ఎదుర్కోన్న విషయాలను గుర్తు చేసారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” 1966 నవబర్ 16 వ తేదీన ఏర్పాటయిందన్నారు. ఆ రోజును “జాతీయ పత్రికా దినోత్సవం” గా దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ లందరు వ్యవహరిస్తున్నారన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు గుండిమెడ రామచంద్ర శర్మ, బి.కె.ఎస్.ఆర్ అయ్యంగార్ , కొమ్మిన రత్న కుమారి, బచ్చు ప్రసాదరావు (బి.పి.ఆర్), బత్తుల కృష్ణ కుమార్, ను దుశ్శాలువలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎపియుడబ్ల్యుజె జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చు కృష్ణ కిశోర్ , ఉపాధ్యక్షులు మధు సూర్యప్రకాశ్, కృష్ణంరాజు, ఉర్ల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గోపీనాథ్ (విన్ రాజు), ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి శిరా వాసు, రాష్ట్ర ఫొటోగ్రాఫర్స్ కార్యదర్శి షేక్ రియాజ్, సామ్నా జిల్లా అధ్యక్షులు చోడిశెట్టి శాంతకుమార్, ఎపియుడబ్ల్యుజె కార్యవర్గ సభ్యులు సిటీకేబుల్ శ్రీధర్, కొల్లు శ్రీనివాస్, ప్రదీప్, కందుల చైతన్య, తదితరులు పాల్గొన్నారు.