కర్నూలు జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు.. పి మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు మరియు శ్రేయోభిలాషులకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు పి.మురళీకృష్ణ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాలలో రైతులు ఏడాదంతా కష్టపడి పండించిన పంటలు సంక్రాంతికి ఇంటికి వచ్చి ప్రతి ఇల్లు ధాన్యపు రాశులతో కలకలలాడు తుంటాయని, ఇంటి ముంగిళ్ళలో ముత్యాల ముగ్గులు, గుమ్మడి పూల గొబ్బెమ్మలు గడప గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకారాలు, మామిడి తోరణాలు, కొత్త అల్లుళ్లు కొత్త కోడళ్ళు, బంధు మిత్రులకు స్వాగతాలు, భోగిమంటల భగ భగలు, చెడును దహనం చేసి, మంచిని కోరుకొనే పండుగ భోగ భాగ్యాల పండుగ సంక్రాంతి పండుగ నూతన సంవత్సరంలో మొదటి పండుగ అని హిందువులకు అతి ముఖ్యమైన పండుగ అని ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని మురళీకృష్ణ గారు అభిప్రాయపడ్డారు.