పింఛన్ల పంపిణితో లబ్ధిదారుల్లో సంతోషం.. టిడిపి నగర అధ్యక్షుడు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని 25వ వార్డు బిర్లాగడ్డలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తెలిపారు. పింఛన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషం వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏమ్మెల్సీ బి.టి నాయుడు, మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, కే.వి సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.