ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూలు ఆయాలపై వేధింపులు ఆపాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూలు ఆయాల సమస్యలు పరిష్కరించాలని ,రాజకీయ నాయకుల ఒత్తిడి ఆపాలని ఏఐటీయూసీ తాలూకా సమితి ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్.క్రిష్ణయ్య ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష,కార్యదర్శులు జి . నెట్టికంటయ్య ఎం రంగన్న ఆధ్వర్యంలో గురువారం పత్తికొండ ఎమ్మెల్యే కే ఏ శ్యామ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.పత్తికొండ నియోజకవర్గం పాఠశాలలో పనిచేస్తున్న స్కూలు ఆయాలను గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని పనిలో నుండి దిగిపోవాలని స్థానిక రాజకీయ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా బలవంతంగా పనిలో నుండి తొలగించారనీ అన్నారు. గత 15 సంవత్సరాల నుండి చాలీచాలని జీతాలతో స్కూళ్లలో ఆయాలుగా పని చేస్తున్నా నెల నెల జీతాలు రాకున్నా పస్తులు ఉండలేక అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ ఆయాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత 2014లో అప్పటితెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కసువు కొట్టకూడదని రూములలో చెత్త వలన విష పురుగులు ఉంటాయని బడులలో పెద్ద వాళ్ళు కసువు వూడ్చాలని వారికి నెలకి 200 రూపాయలు ఇచ్చేవారు.ఈజీతం కూడ 8నెలల ఒకసారి ఇచ్చే వారు. 200ల రూపాయలతో పూటా కూడా గడవడం లేదని ప్రభుత్వాల పై ఉద్యమాల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చిరోజుకు 200 రూపాయలు చెప్పనా నెలకు 6000 రూపాయలు జీతం ఇచ్చే విధంగా సాధించుకోవడం అయినది.200 రూపాయల జీతం ఉన్న రోజు ఏ రాజకీయపార్టీలు, కార్యకర్తలు ఎవరు ముందుకు రాలేదు. 2వందల రూపాయల అయినా ప్రభుత్వం నుండే జీతం వస్తుందని భవిష్యత్తులో అదనంగా కూడా పెంచుతారని ఆశతో ప్రభుత్వ స్కూళ్లలో ఆయలుగా పనిచేస్తున్నాము .