హరోం హర..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: కార్తీక మాసం రెండవ సోమవారం భక్తుల హరోం హర నాదంతో మహానంది పుణ్య క్షేత్రం మారుమోగింది. క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుండి భక్తులు పోటెత్తారు. ఈఓ శ్రీనివాస రెడ్డి భక్తులకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా కొనేర్లలో పుణ్య స్నానాలు చేసి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా శ్రీకామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు.భక్తులకోసం దాతల సహకారంతో వినాయక నంది ఎదురుగా పాలను అందజేశారు. కార్తీక నోములు, సామూహిక అభిషేఖాలతో ఆలయం కిక్కటిల్లింది. భక్తులకు కావలసిన ప్రసాదాలను కొరతలేకుండా చర్యలు తీసుకున్నారు. మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి వారి మొక్కులు తీర్చుకున్నారు.