ఎన్డీఏ కూటమి కి దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ” కి సహకరిస్తా
1 min readదివ్యాంగుల సంక్షేమాభివృద్ధి కి కృషి చేస్తా.!
టిడిపి జిల్లా అధ్యక్షులు పి. తిక్క రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం టిడిపి జిల్లా అధ్యక్షులు పి. తిక్క రెడ్డి ని ఆయన నివాసంలో మల్లేల గ్రూప్స్ అధినేత, సామాజిక వేత్త, వికలాంగుల సంక్షేమ సంఘాల గౌరవాధ్యక్షులు, డాక్టర్ మల్లేల ఆల్ఫ్రెడ్ రాజు అధ్యక్షతన జిల్లా “దివ్యాంగుల సాధికారత ఫోరం” (డిఈఎఫ్) అధ్యక్షులు బి సి నాగరాజు మరియు జేఏసీ కార్యవర్గ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం నుంచి ఆలూరు టు అమరావతి వరకు “ఎన్డీఏ కూటమి కి దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ” చేపట్టబోతున్నట్లు కావున ఎన్డీఏ కూటమి భాగస్వాములైన టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్య మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి ని, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ ని మీ సమక్షంలో కలిసి మా దివ్యాంగుల సమాజం కృతజ్ఞతలు తెలియజేసుకునేందుకు తగిన సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ జిల్లా నుంచి సాగే దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీకి సహకరిస్తూ ఎన్డీఏ కూటమి నేతలను కలిపిస్తానని హమీ ఇచ్చారు.తదుపరి ఏపీ ఎన్జీఓస్ కార్యాలయంలో జరిగిన దివ్యాంగుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి సి నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎం. శివశంకర్, కోశాధికారి ఎ. ఆదిశేషయ్య లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మన దివ్యాంగుల సామాజిక హక్కులు, చట్టాలు, రాయితీ, రిజర్వేషన్లు హరించుకుపోయిన తరుణంలో కర్నూలు జిల్లా వేదికగా సామాజికవేత్త మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారి సారథ్యంలో ఎన్నో బలమైన ఉద్యమాలు కొనసాగాయని ఆ ఉద్యమాల ఫలితమే నేడు మన దివ్యాంగుల సమాజం పొందుతున్న ఆరు వేల పెన్షన్ అని కావున ఈ ఆరు వేల పెన్షన్ తో పాటు ఇంకా మిగిలిన సామాజిక సంక్షేమ అభివృద్ధి ఫలాలు సాధించుకోవాలంటే మనమందరం కలిసికట్టుగా ఇండియా కూటమి ప్రభుత్వ పెద్దలకు ఈ కృతజ్ఞత ర్యాలీ ద్వారా వెళ్లి కలిసి విన్నవించుకోవాలని తెలియజేశారు. త్వరలోనే ఈ “ఎన్డీఏ కూటమికి దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ” కి సంబంధించిన తేదీని ఖరారు చేస్తామని ఇందుకు జిల్లావ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు తాలుకా నాయకులు యు వీరేష్, ఎస్. వెంకటేష్, ఈ. రాజశేఖర గౌడ్, వి నర్సింహులు, దేవనకొండ ధోనీ బజారి, గోనెగండ్ల మండల నాయకులు రంగన్న, బెలగల్ మండల నాయకులు రామదాస్, మల్లికార్జున, రాజు, పెద్దకడుబూరు కన్వీనర్ రామన్న, రామాంజనేయులు, మంత్రాలయం భీమేష్ వివిధ మండలాల నుంచి వచ్చిన వికలాంగులందరూ పాల్గొన్నారు.