ఆరోగ్యంపై… కథనాలు రాయండి..
1 min readప్రముఖ కార్డియాలజి డా. వసంత కుమార్
కర్నూలు, పల్లెవెలుగు: ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యంపై అవగాహన లేక చాలా మంది వ్యాధుల బారిన పడుతున్నారని విజయ దుర్గా హాస్పిటల్ ఎం.డి. ప్రముఖ కార్డియాలజి వైద్యులు డా. వసంత కుమార్ ఆందోళన చెందారు. బుధవారం పల్లెవెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. వసంత కుమార్ మాట్లాడుతూ వ్యాయామం చేయకపోగా… ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటం.. పరిమితికి మించి భుజించడం తదితర కారణాలతో చాలా మంది అనారోగ్య పాలవుతున్నారన్నారు. స్విమ్మింగ్, వాకింగ్, జాగింగ్ చేయకపోవడంతో ఆకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో మృత్యువాత పడుతున్నారని, ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించేలా మీడియా కథనాలు రాయాలని ఈ సందర్భంగా విజయ దుర్గా హాస్పిటల్ ఎం.డి. డా. వసంత కుమార్ ఆకాంక్షించారు.