63మంది గర్భిణీ స్త్రీలకు హెల్త్ చెక్ అప్ పరీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్. వాణిశ్రీ, డాక్టర్ నితీష్ ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం ద్వారా 63 మంది గర్భిణీ స్రీలకు హెల్త్ చెక్ అప్ చేసి పరీక్షలు నిర్వహించి హై రిస్క్ గర్భిణీ స్రీ లకు చికిత్స అందించామన్నారు .రాఘవేంద్ర గౌడు ఆరోగ్య విద్యా భోదకుడు హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ టిఫ స్కాన్ డోన్ ఏరియా ఆసుపత్రి లో ఉచితంగా చేస్తారని, సద్వినియోగం చేసుకోవాలి అని, పోషకాలు, ఐరన్, ప్రోటీన్స్, విటమిన్ సి, బీ 12 ఉన్న ఆహర పదార్థాలు, తృణ దాన్యాలు, డ్రై ఫ్రూట్స్ ప్రతి రోజు తీసుకోవాలి అని, బర్త్ ప్లాన్ ద్వారా కాన్పుకు పోయే ఆసుపత్రి నీ ముందు గానే ఏన్నుకోవాలని, 108,తల్లి బిడ్డ ఎక్సప్రెస్ ను ఉపయోగించుకొవాలని అవగాహనా కల్పించడం జరిగింది. కార్యక్రమం లో సూపర్వైసర్ గంగాదేవి, స్టాఫ్ నర్స్ రోజా, ప్రసన్న ఎం ఎల్ ఎచ్ పి లు, ఏ ఎన్ ఎం లు, ఆశలు పాల్గొన్నారు.