‘గుండె’పై అవగాహన అవసరం…
1 min readప్రముఖ కార్డియాలజిస్ట్, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్
- పేదలకు ఈసీజీ, 2డికో, బీపీ, బ్లడ్ షుగర్ ఉచిత పరీక్షలు చేసిన వైద్యులు
కర్నూలు, పల్లెవెలుగు:శరీర అవయవాలలో గుండె పాత్ర కీలకమని, అటువంటి గుండెపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు ప్రముఖ కార్డియాలజిస్ట్, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్. ఆదివారం స్థానిక ఏ క్యాంపులోని హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 70 మంది పేద ప్రజలకు ఈసిజి, 2డికో, బ్లడ్ షుగర్, బీపీ తదితర వైద్య పరీక్షలను ఉచితంగా చేశారు. అనంతరం మందులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా హార్ట్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలన్నారు. ఉచిత వైద్య శిబిరంలో వాసుదేవ మూర్తి ( సిస్టోపి కంపెనీ) పేదలకు అవసరమైన మందులను ఉచితంగా అందజేయడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో హార్ట్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డా. భవాని ప్రసాద్, ట్రెజరర్ కె.సి. రాముడు, సభ్యులు లక్ష్మణ్, జగన్నాథ గుప్తా , పిజి శ్రీకాంత్, స్టాప్ నర్స్ శాంత తోపాటు పది మంది టెక్నిషియన్స్ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు.