మంత్రాలయం లో భారీ వర్షం
1 min read189. 8 మి మి వర్ష పాతం నమోదు
జలమయం అయిన హైస్కూల్, ఆర్టీసీ బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం, అబోడే హోటల్
ఇబ్బందులు పడిన విద్యార్థులు, ప్రయాణికులు
మంత్రాలయం నాగలదిన్నే రాకపోకలు అంతరాయం
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ఎన్నో రోజులుగా అందరు ఎదురుచూస్తున్న వర్షం తెల్లవారుజామున నుండి ఉదయం వరకు దంచికొట్టింది. మంత్రాలయం లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రామచంద్ర నగర్ లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మైదానంలో వర్షం నీరు నిలవడంతో చెరువును తలపిస్తుంది. దీంతో పాఠశాల కు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో నీరు నిలవడంతో బస్సులు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు, అబోడే హోటల్, గోశాల జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నల్లవాగు ఉధృతి పెరగడంతో నాగలదిన్నే కు వెళ్లేందుకు రాక పోకలు అంతరాయం ఏర్పడింది. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు చలించి భక్తులను మహా ద్వారం తెరిచి మఠం ప్రాకారంలో సేదతీరేందుకు భక్తులను అర్ధరాత్రి లోపలికి రావడానికి అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలు కురవడంతో ఓ పక్క ఆనందం మరో వైపు ఇబ్బందులు పడ్డారు. పంట పొలాలు ముంపునకు గురైన రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.