PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుల కష్టం నేలపాలు…

1 min read

తుఫాను ప్రభావంతో నేలకొరిగిన వరి పంట

తడిసిన పత్తి ని ఆరబోస్తున్న అన్నదాతప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : తుఫాను ప్రభావం వల్ల గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతుల కష్టం నేలపాలు అయ్యాయి. దీంతో రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి.  తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతూ ఉండడంతో మండలం లో ని నియోజకవర్గంలోని వరి, పత్తి రైతులు నిండా మునిగిపోయారు. ఒకవైపు తుఫాను ప్రభావంతో పొలాల్లో సాగు చేస్తున్న పంటలు దెబ్బతింటుండగా చేతికొచ్చిన వరి పంట నేలపాలు కాగా పత్తి ని రోడ్లపై ఆరబోసుకున్న రైతుల పరిస్థితి దారుణంగా మారింది.మండల పరిధిలోని మాధవరం గ్రామానికి చెందిన జంగం వీరన్న స్వామి ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాడు. దీనికి సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. పంట బాగుంది అనే ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వరి పంట నేలకొరిగింది. దీంతో మూడు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే ఇలా నష్టం రావడంతో ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే పత్తి పంట వేసిన రైతులు తడిసిన పత్తి ని రోడ్ల పై ఆరబోసుకుని ఇంటికి తీసుకుని పోతున్నారు. వేలు, లక్షల  ఆవిరి అయిపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

About Author