చెన్నూరు వద్ద పెన్నా నదికి భారీగా పెరుగుతున్న నీటి ప్రవాహం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కడప నంద్యాల జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో కుందు నది. పాపాగ్ని వక్కిలేరు . చిన్నపాటి వంకలనుంచి పెన్నా నదిలోకి వరద నీరు చేరడంతో చెన్నూరు వద్ద 38500 క్యూసెక్కులు వరద నీరు పెన్నా నది నుంచి దిగువ ఉన్న సోమశిల జలాశయంలోకి వరద నీరు ప్రవహిస్తున్నది. చిత్రావతి పెన్నా నది అనుసంధానంగా నిర్మించిన గండికోట జలాశయం నిండడంతో అక్కడ నుంచి మైలవరం జలాశయంలోకి భారీగా వరద నీరు వదలడంతో మైలవరం జలాశయం గేట్లెత్తి పెన్నా నదిలోకి వదలడంతో జమ్మలమడుగు ప్రొద్దుటూరు ప్రాంతాల మీదుగా వల్లూరు మండలం ఆ దీనిమాయపల్లి పెన్నా నది ఆనకట్ట నుంచి పెన్నా నది ద్వారా చెన్నూరు మీదుగా సోమశిల జలాశయంలోకి వెళ్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫలితంగా బుధవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి వాయుగుండం తీరం దాటడంతో వర్షం కురవకపోవడంతో రైతులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నూరు వద్ద పెన్నా నదిలో భారీగా నీటి ప్రవాహం పెరుగుతుండడంతో నదిలో ఎవరు దిగకుండా రెవెన్యూ పోలీసులు నిగా పెట్టారు.