హలో విద్యార్థి చలో విజయనగరం…ఏఐఎస్ఎఫ్
1 min readఏఐఎస్ఎఫ్ 49 వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి.
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుంద మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో_ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు విజయనగరంలో జరిగే ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర రాష్ట్ర మహాసభలు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం రవి అస్తమించిన బ్రిటిష్ పాలనపై విరోచిత పోరాటం చేసి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన భగత్ సింగ్ రాజ్కూరు సుకుదేవుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 1939 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో ఆరుభవించి స్వాతంత్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించింది నాటి నుండి నేటి వరకు సమరసిల ఉద్యమాలకు వేదిక అయింది విద్యార్థులలో చైతన్యాన్ని రగిలించి సాంఘిక శక్తికి ఐక్యతను స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.ఏఐఎస్ఎఫ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ప్రవేశపెట్టిన మోకాలే విద్య విధానానికి సమాధి కట్టాలని ఆశాస్త్రీయ కషాయ భావాలతో భావితరాలను బానిసలను చేసే లోపభూషితమైన విధానాలకు కాలం చెల్లిందంటూ విద్యా ప్రవేటికన్నా కాషాయకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్న సంఘం ఏఐఎస్ఎఫ్ కానీ పాలకవర్గాల ప్రభుత్వ విద్యారంగా చేస్తూ కొట్టలకు పాల్పడుతున్నారు విద్యారంగానికి అరకుర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు కేటాయించిన అతిపెద్ద నిధులు కూడా ఖర్చు చేయకుండా దారి మళ్ళిస్తున్నారు పాఠశాలలో కళాశాలలు హాస్టల్స్ లో వసతులను సమకూర్చి ఉపాధ్యాయులను ప్రభుత్వమే నియమించాలన్న విషయాన్ని ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కేంద్ర బడ్జెట్లో 6% రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యకు కేటాయించాలన్న కోఠారి కమిషనర్ సిఫారసులను మురుగునపడిపోయాయి 77 ఏళ్ల స్వాతంత్ర భారతవనిలో అందరికీ విద్య అందని ద్రాక్ష లాగే మిగిలిపోయింది అంగడి సరుకుగా మారిపోయింది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా పొందుపరచబడిన విద్య హక్కు కేవలం కాగితాలకే కేంద్రంలోకి మూడోసారి అధికారుల్లోకి వచ్చిన బిజెపి విద్యారంగంలో తను మార్పులు చేసింది నూతన జాతీయ విద్యా విధానం 20-20 ను ప్రవేశపెట్టింది ప్రాథమిక స్థాయి నుండి ఉన్నంత స్థాయి వరకు విద్యారంగాన్ని ప్రైవేటీకరణ కార్పొరేట్ కరుణ కషాయీకరణ చేయడం ద్వారా పేదలకు చదువును దూరం చేయాలనే ప్రధాన అజెండాను మోడీ ప్రభుత్వం భుజాన వేసుకుని నూతన విద్య విధానాన్ని తెరపై తెచ్చింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు తగిన బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ మండల సహాయ కార్యదర్శి రాజేష్ మండల నాయకులు దేవరాజు రవి మల్లి రమేష్ ప్రకాష్ మల్లయ్య రాము విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.