సూర్య నారాయణుడి సన్నిధిలో హీరో ఆకాష్ పూరి
1 min readకర్నూలు, పల్లెవెలుగు: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు, హీరో ఆకాష్ పూరి ఆదివారం అమావాస్య ను పురస్కరించుకుని నగరంలోని సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అంతకు ముందు దేవాలయ ట్రస్ట్ చైర్మన్ టి. శివరామకృష్ణ దంపతులు సినీ హీరో ఆకాష్ పూరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శనం అనంతరం… హీరో ఆకాష్ పూరికి ట్రస్ట్ చైర్మన్ టి. శివరామకృష్ణ దంపతులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆ తరువాత స్వామివారి ప్రసాదం అందజేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆకాష్ పూరిని వేద మంత్రోచ్చరణాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సినీ హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలులో అత్యంత వైభవంగా శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం నిర్మించారని, స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భక్తి పెంపొందించేలా ఆధ్యాత్మికంగా చిత్రాలు రూపొందించడం ఆలయ ప్రత్యేకతగా ఉందన్నారు.