కర్నూల్ కు హైకోర్టు బెంచ్ రావడం హర్షనీయం- మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూల్ నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రం విడిపోయిన పక్షంలో హైకోర్టునే ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా కోరినట్టు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం హైకోర్టును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి అనంతరం సుప్రీంకోర్టులో. హైకోర్టును తరలించే ఉద్దేశమే లేదని ద్వంద వైఖరిని తెలిపిందని విమర్శించారు. తదనంతరం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చొరవ చూపడం అభినందనీయమన్నారు. మంత్రి టీజీ భరత్ ప్రతి కేబినెట్ సమావేశంలో కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పట్టు పట్టడం, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముఖత వ్యక్తం చేయడం సంతోషించ తగ్గ విషయం అన్నారు. ఎన్ని పోరాటాలు చేసిన, దానిని తీసుకువచ్చే నాయకులు కూడా ఉండాలని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడిగా మంత్రి టీజీ భరత్ నిరూపించుకున్నారని టీజీ వెంకటేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి లీగల్ సెల్ నాయకులు దాశెట్టి శ్రీనివాసులు, హరినాథ్ చౌదరి, గణేష్,సుమన తదితరులు పాల్గొన్నారు.