అధికంగా ఎన్ఆర్ఐ గరుడ మొక్కజొన్న పంట దిగుబడి
1 min readపంట దిగుబడిపై రైతులకు అవగాహన
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ఎన్ఆర్ఐ గరుడ-157 హైబ్రిడ్ మొక్కజొన్న పంట అధికంగా రావడం పట్ల రైతులకు ఎన్ఆర్ఐ సిబ్బంది అవగాహన కల్పించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామానికి చెందిన రైతు కురువ ఓబన్న బైరాపురం గ్రామ పొలిమేరలో వేసిన నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను ఎన్ఆర్ఐ వైస్ ప్రెసిడెంట్ కే సాంబశివరావు,రీజినల్ మేనేజర్ రమేష్ నాయుడు, కర్నూలు,అనంతపురం ఎస్ఓ లు శివ ప్రసాద్,వరేంద్ర పంట పొలాన్ని వారు బుధవారం ఉదయం పరిశీలించారు. మిగతా మొక్కజొన్న పంటల కన్నా ఎన్ఆర్ఐ గరుడ మొక్కజొన్న పంటలు అధికంగా దిగుబడి రావడంతో రైతు ఓబన్న సంతోషం వ్యక్తం చేశారు.ఈ పంట దిగుబడి గురించి పొలం దగ్గర బైరాపురం,చెరుకు చెర్ల గ్రామాల రైతులకు దిగుబడి గురించి ఎన్ఆర్ఐ వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు అవగాహన కల్పించారు.వచ్చే సంవత్సరం నుండి ఈ విత్తనాలను రైతులు తీసుకొని అధిక పంటల ద్వారా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు రైతు మిర్చి,లలిత సీడ్స్ డీలర్లు మరియు చెరుకుచెర్ల, బైరాపురం గ్రామాల రైతులు పాల్గొన్నారు.