PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: పొలంబడి ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందే విషయాలు తెలుసుకోవచ్చని నంద్యాల డి ఆర్ సి.  ఏడిఏ సరళమ్మ తెలిపారు.శనివారం మహానంది మండలం నంది పల్లె గ్రామంలో మేలైన సాగు యాజమాన్య పద్ధతులపై పొలంబడి కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ పొలంబడి కార్యక్రమంలో నంద్యాల జిల్లా వనరుల కేంద్రం  ఏడిఏ సరళమ్మ హాజరై మాట్లాడుతూ పొలంబడి ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందే విషయాలు తెలుసుకోవచ్చునని, ప్రతివారం రైతులు ఈ పొలంబడిలో పాల్గొనాలని కోరారు.వరిలో సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. సూడోమోనాస్ అనే జీవ సిలింద్రనాసిని ని ముందు జాగ్రత్తగా పిచికారి చేయుట ద్వారా అగ్గి తెగులు రాకుండా నివారించుకోవచ్చునన్నారు. దీనిని వాడేటప్పుడు వేరే రసాయనాలతో కలిపి వాడరాదని రైతులకు తెలియజేశారు. రైతులకు ముందస్తు బ్యాలెట్ బాక్స్ పరీక్షను నిర్వహించి, వారికి పంట సాగు పద్ధతులపై ఉన్న, అవగాహన గురించి తెలుసుకోవడం జరిగిందని,ఖరీఫ్ లో చదరపు మీటరుకు 33 వరి దబ్బులు ఉండే విధంగా చూసుకోవాలని, రైతులకు తెలిపారు. వరి గట్ల పైన కందులు , నువ్వులు లాంటివి వేసుకోవడం ద్వారా, అదనపు ఆదాయాన్ని పొందవచ్చునని,గట్లపైన బంతి మొక్కలను నాటుట ద్వారా, మిత్ర పురుగులు ఆకర్షించడానికి దోహద పడతాయని, వరి నారు కొనలు తుంచి నాటుట ద్వారా తోలుచు పురుగు గుడ్లను నివారించవచ్చునని, రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాసరెడ్డి, గ్రామ వ్యవసాయ అధికారులు లక్ష్మీకాంత్, మధు,  కృష్ణ కాంత్,  పల్లవి,  షైనీ, పొలంబడి రైతులు పాల్గొన్నారు. 

About Author