PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా బ్యాంకులో డిపోసిట్స్ పై అత్యధిక వడ్డీ రేటు

1 min read

రీజినల్ మేనేజర్ PS నవీన్ కుమార్.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కర్నూలు RM నవీన్ కుమార్ గారు ప్రాంతీయ కార్యాలయం  సమావేశం లో మాట్లాడుతూ డిపోసిట్స్ పై అన్ని బ్యాంకులకంటే అత్యధిక వడ్డీ రేటు ఇస్తూ, అందరి ప్రగతి లో భాగం కావడం సంతోషకరమైన విషయం అనీ,మా బ్యాంకు లో ప్రగతి కుబేర  పథకం అత్యంత ప్రాముఖ్యత చెంద టానికి మేము ఇస్తున్న వడ్డీ రేటు చాలా ఆకర్షణ అనీ, అందులో మహిళలకు అత్యంత ప్రాధాన్యత గా సూపర్ సీనియర్ సిటిజెన్ కి 8.30 వడ్డీ రేటు ఇస్తున్నామని మహిళలు విరివిగా అవకాశం ని ఉపయోగించుకోవాలన్నారు.మన కర్నూలు టౌన్ నందే 12 శాఖలతో వ్యాపారం చేస్తూ, అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతవాసులకు దగ్గరైనమని, లోను ల విషయం లో త్వరిత గతిన ప్రాసెస్ చేయడానికి సరళ రుణ కేంద్రం మా ప్రాంతీయ కార్యాలయం లో నే ఉండి, సేవలు అందిస్తుందని, పేర్కొన్నారు.అలాగే మా బ్యాంకు లో కమర్షియల్ బ్యాంకు లకు దీటు గా మొబైల్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, QR కోడ్, మిస్డ్ కాల్ బ్యాంకింగ్, AEPS ఛానల్, ఇలా అన్నీ రకాల సదుపాయాలు కలవని చెప్పారు.ఈ రీజియన్ సర్వతో ముఖభి వృద్ధి కి అందరం కష్టపడుతున్నామని, కస్టమర్ సేవలో ముందు వుంటామని..భవిష్యత్తు లో బ్యాంకింగ్ అత్యంత ప్రాముఖ్యత గల రంగమని ఉదగటించారు. రీజినల్ మేనేజర్ శ్రీ PS నవీన్ కుమార్.

About Author