హైందవ శంఖారావం …
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బహిరంగ సభ 5 జనవరి 2025 మద్దతు కొరకు సన్నాహక సమావేశము SSK సమాజ్ రామాలయం,కోడుమూరు, కర్నూలు జిల్లా.శ్రీ నంది రెడ్డి సాయి రెడ్డి దక్షిణాంధ్ర ప్రాంతా అధ్యక్షులు దేవాలయాలు పరిరక్షించుకోవడం అవసరం, దేవాలయాలను హిందువులే పరిరక్షించుకోవాలి, దాని కొరకు ప్రతి హిందువు మిస్డ్ కాల్, క్యూఆర్ కోడ్ స్కానింగ్, తప్పనిసరిగా చేయాలని తెలిపారు, కోడుమూరు నుండి కనీసం చలో విజయవాడకు హైందవ శంఖారావం మద్దతు కొరకు వెయ్యిమంది ప్రయాణం చేయవలసిందిగా మార్గదర్శం చేశారు.ఈ కార్యక్రమంలో సందడి మహేష్ విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కోశాధికారి, పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే, ఎద్దుల మహేష్ రెడ్డి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, కునిగిరి నీలకంఠ కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షులు, రాజేష్ బజరంగ్దళ్ కర్నూల్ విభాగ్ కన్వీనర్, ఈపూరి నాగరాజు విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా సహకార దర్శి,మిస్కిన్ రాంప్రసాద్ SSK సమాజ్ కోడుమూరు అధ్యక్షులు, నర్రా నాగేశ్వరరావు విశ్వ హిందూ పరిషత్ కోడుమూరు అధ్యక్షులు, కిరణ్ ఉపాధ్యక్షులు వేదికను అలంకరించారు,SSK సమాజ్ కార్యకర్తలు కోడుమూరు హిందూ బంధువులు పాల్గొన్నారు .