వీహెచ్పి”షష్టిపూర్తి” సందర్భంగా హిందూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి
1 min readవిశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ…..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీ, భరతమాత మందిర ప్రాంగణంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన కర్నూలు జిల్లా సమావేశంలో పాల్గొన్న కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ…..విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సమితి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా రాబోయే విశ్వ హిందూ పరిషత్ స్థాపనా దివస్ (శ్రీ కృష్ణ జన్మాష్టమి) వేడుకలను లక్ష జనాభా కలిగిన ప్రఖంఢ కేంద్రాలలో రాబోయే ఆగష్టు 16 వతేదీ నుండి ఆగస్టు 31 వరకు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమ్మేళనాలకు…. ప్రఖంఢలోని అయోధ్య ‘సమర్పణ అభియాన్’ లో పనిచేసిన కార్యకర్తలను,’హితచింతక్’ , ‘ధర్మరక్షానిధి’ ఇచ్చిన దాతలను, ‘అయోధ్య అక్షింతల పంపిణీ’ లో సహకరించిన హిందూ బంధువులను, వారి కుటుంబంతో సహా పాల్గొనేలా చూడాలని, ప్రఖంఢలో రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాలని సూచించారు.కర్నూలు నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి మాట్లాడుతూ….నగరంలోని ఆరు ప్రఖండలలో ఈ హిందూ ఆత్మీయ సమ్మేళనాలు ను ఘనంగా నిర్వహించాలని అందుకోసం ప్రతి ప్రఖంఢలోని ఉపఖండ(వీధి కమిటీ) లలో కనీసం 4 కార్యకర్తలతో విశ్వ హిందూ పరిషత్ సమితి ని ఏర్పాటుచేయాలని అలా చేయడం వల్ల ప్రఖండలలో హిందూ ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా నిర్వహించుకోవచ్చు నన్నారు. కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ మాట్లాడుతూ…. కర్నూలు జిల్లా పరిధిలోని 12 ప్రఖండలలో ఆగష్టు 16 వ తేదీ నుండి 31 వ తేదీవరకు నిర్వహించబోయే షష్ఠిపూర్తి హిందూ ఆత్మీయ సమ్మేళనాలు నగరం లోని 6 ప్రఖంఢ కేంద్రాలలో నే కాక, గ్రామీణ స్థాయిలో ఉన్న 6 ప్రఖండలలో కూడా ఘనంగా నిర్వహించ బోతున్నామనీ ప్రతి సమ్మేళనం వందల మందితో నిర్వహిస్థామనీ ఇందుకోసం కేంద్రీయ,రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవ్వబోతున్నారనీ తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థలో నూతనంగా వెంకటేశ్వర్లు, వేణు ఆచారి, నాగరాజు ఆచారి, రాఘవేంద్ర ఆచారి, సురేష్, సోమన్న, ఫణీంద్ర, బజరంగ్దళ్ ప్రవీణ్ కుమార్, పవన్ కుమార్, హేమంత్, రాకేష్, కోటేశ్వర్ బాబు, శ్రవణ్ కుమార్, జితేంద్ర గారలు బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, విభాగ్ ధర్మప్రసార్ కన్వీనర్ కాళంగిరి విజయుడు, జిల్లా సహకార్యదర్శి గూడూరు గిరిబాబు, ఈపూరి నాగరాజు, నగర ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు, నగర కార్యకర్తలు ప్రఖంఢ అధ్యక్షులు అయోధ్యాచలపతి, మొగలి రవీంద్ర గౌడ్, సర్వేష్ , ఉపాధ్యక్షులు లొద్దిపల్లె రాజారెడ్డి, వేముల గోపిశెట్టి,సల్కాపురం బాబూరావు, కోడుమూరు పెనుమాడ కిరణ్, కార్యదర్శులు కరణం సుధాకర్, శివకోటి చంద్రశేఖర్, ఉపేంద్ర నాయక్, కురుకుంట్ల సంజీవయ్య, జంపాల నవీన్, నటరాజ్, బజరంగ్దళ్ సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.