మహోన్నతం.. భారత రాజ్యాంగం.. నగరపాలక కమిషనర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభమని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని నగరపాలక కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా మనకు ఎన్నో హక్కులు సంక్రమించాయన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తయారు చేయడంలో చేసిన కృషిని అభినందనీయమన్నారు. అనంతరం అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ పీఠికపై కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆరోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జునైద్, ఎంఈలు సత్యనారాయణ, శేషసాయి, టిపిఆర్‌ఓ వెంకటలక్ష్మి, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.