కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి..
1 min readసీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నరసింహులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధ్యక్షులు వై నరసింహులు అన్నారు.సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మరియు అఖిల భారత కూలీ రైతు సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంలో నరసింహులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అనగారిన వర్గాల కోసం తన జీవితాంతం కృషిచేసి భారత రాజ్యాంగాన్ని రాసి ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం కల్పించిన అంబేద్కర్ ని దేశ పార్లమెంట్ సాక్షిగా అవమానించినందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే క్యాబినెట్ పదవి నుండి తొలగించాలని అమిత్ షా ప్రజలందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో నిరుద్యోగం రైతాంగ సమస్యలు నిత్యవసర వస్తువుల ధరలు తదితర ప్రజా సమస్యలు పరిష్కరించకుండా నిత్యం ఏదో సాకుతో ప్రజల ఐక్యతను దెబ్బతీసే వ్యాక్యలు చేస్తున్నారని దేశ రాజ్యాంగాన్ని లౌకిక తత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం దేశ ప్రజలకు ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.కావునా కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రజలు ప్రజాస్వామ్య వాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్ ఐఎఫ్టి యు డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గోవిందు,శేఖర్,అశోక్,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.