ప్రమాదాలకు నిలయంగా..బ్రాహ్మణకొట్కూర్ బ్రిడ్జి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఈ రహదారి అనునిత్యం రద్దీగా ఉంటుంది ఈ రహదారిలోనే శ్రీశైలం మరియు విజయవాడకు వెళ్లే రోడ్డు మరియు కర్నూలు హైదరాబాదు వెళ్లే రోడ్డు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్ పక్కనే బ్రిడ్జి (దుప్పట్ల వాగు) ప్రమాదాలకు నిలయంగా ఉంది.ఈ రోడ్డు వైపునే పగలనకా..రాత్రనకా రోజుకు వేల సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ బ్రిడ్జికి ఇరువైపులా రక్షణగా ఉన్న ఇనుప కడ్డీలతో గతంలో ఏర్పాటు చేశారు.ఇదీ తుప్పు పట్టి రోడ్డు వైపున కింద పడింది.భారీ వాహనాలు ఎదురెదురుగా వస్తే చాలా కష్టంగా ఉంటుందని అంతే కాకుండా రాత్రివేళ సమయంలో వాహన దారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని రోడ్డు మీదకి ఇనుప కడ్డీలు రావడం మరియు బ్రిడ్జి దగ్గర ప్రమాదాలు జరగకుండా గుర్తింపు చిహ్నాలు లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రయాణికులు అంటున్నారు. పక్కనే పోలీస్ స్టేషన్ అందులో అమరావతికి శ్రీశైలానికి వెళ్లే రోడ్డు ఇది పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి అధికారులు మంత్రులు పెద్దపెద్ద నాయకులు ఇక్కడే వెళ్తూ ఉన్నారు మరి ఈ రోడ్డు బ్రిడ్జి ఏ విధంగా ఉండాలో మరి అధికారులే ఆలోచించాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు పైన ఉన్న ఇనుప కడ్డీలను తొలగించి బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడ మరియు రోడ్డు చిహ్నాలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.