హోం ఓటింగ్ ” సద్వినియోగం చేసుకోవాలి..
1 min readదరఖాస్తు చేసుకునేందుకు నేడే తుది గడువు
ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
విభిన్న ప్రతిభావంతులకు ఇంటి వద్ద నుండి ‘హోం ఓటింగ్’ ద్వారా ఓటు హక్కు అవకాశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వినియోగించుకోలేనివారు “హోం ఓటింగ్ ” సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని విభిన్న ప్రతిభావంతులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారు, 85 సంవత్సరాల వయస్సు దాటిన వృద్దులు వారి కోసం “హోం ఓటింగ్ ” ద్వారా ఇంటి వద్ద నుండి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. దీని కోసం అర్హులైన అభ్యర్థులకు ఇంటింటికి వెళ్లి ఈ నెల 15 నుంచి 23 వ తేది వరకు బి ఎల్ ఓ లు సంబందిత ఫారం-12 (డి) దరఖాస్తులను అందచేయడం జరిగిందన్నారు. అదే విధంగా వాటిని ఈ నెల 21 నుంచి 23వ తేది వరకు సంబందిత సెక్టరల్ ఆఫిసర్లు ఆయా ఇళ్ళకు వెళ్లి వాటిని స్వయముగా పరిశిలించడం జరుగుతుందన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 23 వతేదీలోగా తిరిగి వారికి అందించాలన్నారు. దరఖాస్తులను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి, అర్హతను పరిశీలించి అర్హత కలిగిన వారికి మే, 2వ తేదీ నుండి 5వ తేదీ లోగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు ఇంటి వద్ద ఓటు వేయు అవకాశం కల్పించబడుతున్నారు. సదరు “హోం ఓటింగ్ ” ప్రక్రియ ఎన్నికల ప్రిసైడింగ్ మరియు ఇతర ఎన్నికల అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, బీఎల్ ఓ లు, సెక్టార్ అధికారులు మరియు పార్టీల ఏజెంట్ల సమక్షంలో వీడియోగ్రఫీ ద్వారా ఓటింగ్ జరుగుతుందన్నారు.