అన్ని రకాల వ్యాధులకు హోమియోపతి వైద్యం శాశ్వత పరిష్కారం
1 min readఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ కేర్ హోమియో వైద్య బృందంచే ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు* మాట్లాడుతూ చర్మ సమస్యలు,కీళ్ల నొప్పులు,శ్వాస సమస్యలు, థైరాయిడ్,లివర్ సమస్యలు కిడ్నీ సమస్యలు మైగ్రేన్,తలనొప్పి,షుగర్ వ్యాధి మొదలగు సమస్యలకు హోమియో వైద్యం శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుందన్నారు.అయితే హోమియో వైద్యం ద్వారా వ్యాధి స్పీడ్ గా కాకుండా కొంత సమయం తీసుకుంటుంది అన్నారు.శాస్త్ర చికిత్స చేయవలసిన వ్యాధులకు కూడా శస్త్ర చికిత్స అవసరం లేకుండా హోమియోపతిలో వైద్యం ఉందన్నారు. మున్సిపల్ సిబ్బంది పని ఒత్తిడితో ఉంటారని వారి కొరకు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అయితే నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ఏ.భాను ప్రతాప్,మాజీ డిప్యూటీ మేయర్, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, అదనపు కమిషనర్ జి.చంద్రయ్య, మాజీ ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు,వంకదారు ప్రవీణ్, షబ్బన శ్రీనివాసరావు,గునుపూడి శ్రీనివాసరావు,బత్తిన విజయ్ కుమార్,దేవరకొండ శ్రీనివాసరావు, నున్న కిషోర్,పాము శామ్యూల్,దారపు తేజ, తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ కేర్ హాస్పిటల్ ఏలూరు బ్రాంచ్ మేనేజర్ ఎం.సుష్మ ఆధ్వర్యంలో డాక్టర్ అజయ్ బాబు,డాక్టర్ ప్రసాద్, ఫార్మసిస్టులు వైద్య సేవలు అందించారు. వైద్య సేవలు పొందిన వారికి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు చేతుల మీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు.