ఘనంగా ఆర్టీసీ మహిళా కండక్టర్ సింహాద్రి పద్మావతి పదవి విరమణ
1 min readపలువురు సహచర ఉద్యోగులు,ఆత్మీయ బంధువుల సమక్షంలో సన్మాన కార్యక్రమం
విచ్చేసిన పలువురు ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, కార్యాలయం సిబ్బంది
కండక్టర్ సింహాద్రి పద్మావతి సేవలు ఎనలేనివి
దైవ సేవకులు
జెస్లీ నోవా, బండి జీవానందం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా (ఏపీఎస్ఆర్ టిసీ) సంస్థలో 22 ఏళ్ళపాటు మహిళా కండక్టర్ గా సింహాద్రి పద్మావతి విశిష్ట సేవలందించారని పలువురు ఆర్ టిసీఉద్యోగులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం డిపోలో మహిళా కండక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సింహాద్రి పద్మావతి గత నెల ( ఆగస్టు ) 31వ తేదీన పదవి విరమణ చేశారు. పదవి వివరణ సందర్భంగా జంగారెడ్డిగూడెం అసిస్టెంట్ డిపో మేనేజర్ వరలక్ష్మి , మజ్దూర్ యూనియన్ నాయకులు రామారావు, నరేంద్ర, పలువురు ఉద్యోగులు పద్మావతి సేవలను అభినందించారు. అలాగే ఆమె కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కండక్టర్ పద్మావతి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక పెరుగు చెట్టు వద్ద జయం మినీ ఏ/సి కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పద్మావతి గత కొన్ని సంవత్సరాలుగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. పద్మావతి భర్త ఇదే ఆర్టీసీ సంస్థలో డ్రైవర్ గా పనిచేస్తూ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణానంతరం పద్మావతి కండక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఉన్నతాధి కారుల మన్ననలతో ఆర్టీసీలో పద్మావతి అనేక సేవలు అందించారు. తోటి ఉద్యోగస్తుల ఆదరభిమానాలు చూరగొంటూ మచ్చలేని మంచి ఉద్యోగిగా నేడు పదవి విరమణ పొందటం అభినందనీయమనిసంస్థ విశ్రాంత ఉద్యోగులు బెజవాడ. రవి ( బివిఎం రావు), చంద్రమౌళి, మహిళా కండక్టర్ వల్లికుమారి, కండక్టర్ గోరింక అనిల్ కుమార్, రాజా, బైబిల్ మిషన్ చర్చి దైవ సేవకులు జెస్లీ నోవా, క్రైస్ట్ చర్చ్ దైవ సేవకులు బండి జీవానందం, పలువురు వక్తలు పదవి విరమణ సభలో కొనియా డారు. ఆర్టిసి సంస్థలో కండక్టర్ గా ఒక మహిళ సేవలందించడం ఆషామాషీ విషయం కాదని ఎన్నో ఉడుదుడుకులతో క్రమశిక్షణ, నిబద్ధత విధేయతతో ముందుకు కొనసాగడం ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఆ దైవ సంకల్పమే ఆమె తోడుండి నడిపించిందనీ అన్నారు. ఈ విశ్రాంత సమయం నుండి ఆధ్యాత్మిక దైవ సన్నిధిలో కొనసాగుతూ పదిమందికి సహాయకారిగా నిలవాలని ఆకాంక్షించారు. పదవి విరమణ ప్రతి ఒక్క ఉద్యోగికి అనివార్యమని రాబోయే రోజుల్లో పద్మావతి కోరుకున్న విధంగా కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యంగా ఆధ్యాత్మికంగా, ప్రశాంతంగాగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా కండక్టర్ పద్మావతి కుమార్తె, భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాద్యాయురాలు ఎస్.శివ శ్రీలత మాట్లాడుతూ తన తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని నిలబెట్టి ఆర్టీసీ సంస్థలో కండక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సేవలు అందించారని అన్నారు. తన మొదటి టీచర్ తన తల్లేనని.చిన్ననాటి నుంచి హిందీ అక్షరాలను నేర్పించి హిందీ పట్ల తన తల్లి ఆసక్తిని పెంచిందని, తన తల్లి ప్రోత్బలం వల్లే ఈ రోజున హిందీ ఉపాధ్యా యురాలుగా ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. ఈకార్యక్రమంలో భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు,ఆర్టీసీ ఉద్యోగులు, పలువురు జర్నలిస్ట్ లు, కుటుంబ సభ్యులు,ఆత్మీయులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.