ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవ అధ్యక్షులు ఆకు మళ్ల నానికి ఘన సత్కారం!
1 min readఘనంగా ఆంధ్ర స్వర్ణముకి 5వ వార్షికోత్సవాలు
పల్లెవెలుగు వెబ్ రాజమండ్రి : ఆంధ్రరాష్ట్ర స్వర్ణముఖి 5వ వార్షికోత్సవాలు రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. స్వర్ణముఖి వ్యవస్థాప అధ్యక్షులు ఆకుల సీతారామరాజు ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవాలు నిర్వహించారు. వార్షికోత్సవలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న యంగ్ అండ్ డైనమీక్ లీడర్ ఉభయ రాష్ట్రాల యంబిసి.గౌరవ అధ్యక్షులు డా.ఆకుమళ్ళ.నాని కి స్వర్ణముఖి టీం ఘనస్వాగతం పలికారు. మరో ముఖ్య అతిథిగా స్థానిక టిడిపి శాసన సభ్యులు అదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమంతదనంతరం డా.ఆకుమళ్ళ నానిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖలు పాల్గొన్నారు.