సన్మానాలు మరింత బాధ్యతను పెంచుతాయి: ఎస్టీయు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ఏ ఏ రంగంలో అయినా విశిష్టమైన సేవలు అందించిన వారికి సన్మానాలు సర్వసాధారణం. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను గుర్తించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈనెల 5వ తేదీన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్నికైన ఏనుగుమర్రి ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు యస్ .సోనీ కి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు వచ్చిన సందర్భంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయూ ప్యాపిలి మండల శాఖ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టియు నాయకులు వెంకట్ నాయక్, చిన్నపరెడ్డి, హాజి మస్తాన్ వలి,చంద్రమౌళి, కిరణ్ కుమార్ , పవిత్రన్ రావ్, తదితరులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో సోనీ చేసిన కృషిని, వినూత్న రీతిలో విద్యార్థులకు బోధించడం, రాష్ట్రస్థాయి , జిల్లా స్థాయి పోటీలకు సైన్స్ ఫెయిర్ లలో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడం, వినూత్న ప్రయోగాలు ,ప్రాజెక్టులు నిర్వహించడం వంటి అంశాలలో ఆమె చేసిన కృషిని కొనియాడారు. అనంతరం ఎస్టీయు నాయకులు శాలువా, పూలమాల,మెమోంటోలతో సన్మానించడం జరిగింది. శ్రీమతి సోనీ మాట్లాడుతూ సన్మానాలు మరింత బాధ్యతను పెంచుతాయనీ గుర్తు చేసుకుంటూ విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెబుతూ,ఎస్టీయు నాయకులు పెద్ద సంఖ్యలో ఏనుగుమర్రి పాఠశాలకు హాజరై తనకు ఘన సన్మానం చేయడం ఆనందంగా ఉందని తెలుపుతూ,ఎస్టీయు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్ వెంకట్ నాయక్, ఏనుగుమర్రి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఎస్.టి.యు జిల్లా ఉపాధ్యాయ వాణి కన్వీనర్ చిన్నపరెడ్డి, యస్.టి.యు ప్యాపిలి మండల అధ్యక్షుడు హాజీమస్తాన్ వలి, ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, ఆర్థిక కార్యదర్శి నాగమల్లేష్, గౌరవాధ్యక్షులు రామాంజనేయులు, కిరణ్ కుమార్, జిల్లా కౌన్సిలర్లు పవిత్రన్ రావు, మద్దిలేటి, మండల సహా అధ్యక్షులు ఈశ్వర్ యాదవ్ ,వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి,శ్రీనివాసులు, మండల వాణి కన్వీనర్ శివ, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.