PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూర్తయిన 6 వేల ఇళ్లను ఫిబ్రవరి 1న గృహప్రవేశాలకు సిద్దం చేయండి

1 min read

గృహనిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీన చేపట్టనున్న లక్ష గృహాల ప్రవేశాల నేపధ్యంలో ఏలూరు  జిల్లాలో 6 వేల ఇళ్ల లబ్దిదారులకు తాళం చెవులు అందించే గృహ ప్రవేశాలు కార్యక్రమాన్ని పటిష్ట కార్యాచరణతో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం స్ధానిక కలెక్టర్ బంగ్లా నుంచి ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించే గృహప్రవేశాల కార్యక్రమం,ఇళ్ళ నిర్మాణ ప్రగతి గృహనిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ గత ఆరు మాసాల్లో జిల్లాలో చేపట్టిన ఇళ్ళ నిర్మాణ పనులకు సంబంధించి ఫిబ్రవరి 1న 6 వేల ఇళ్లకు సంబంధించి లబ్దిదారులకు తాళం చెవులు అందించాలని (గృహప్రవేశం) లక్ష్యం కాగా ఇంతవరకు 5,947 ఇళ్లు పూర్తిచేశారని,  నెలాఖరులోపు మిగిలిన  ఇళ్లు పనులు కూడ యుద్దప్రాదికపై పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో  7వేల ఇళ్లు పూర్తచేయాలనే లక్ష్యానికి అనుగుణంగా మార్చి నెలాఖరునాటికి వాటిని పూర్తి చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇందుకు స్వీయ లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని కనీసం రోజుకు 116 ఇళ్లు పూర్తిచేసేలా మండలానికి 3 ఇళ్లు నిర్మాణం పూర్తిచేసేందుకు సంసిద్ధం కావాలన్నారు. పూర్తయిన ఇళ్లతోపాటు స్టేజ్ కన్వర్షన్ నిర్మాణాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  సమావేశంలో జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి జి.వి. సత్యనారాయణ, హౌసింగ్ ఇఇలు,డిఇలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమినిటీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *