రెడ్ల రాజ్యం… ఇంకెంతకాలం…!
1 min readబీసీలు రాజకీయంగా ఎదగాలి…
- ఆశీర్వదించండి..
- తాగునీరు, రోడ్లు, బస్సు, కేజీబీవీ స్కూల్ ఏర్పాటుకు హామీ
- ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
ఆదోని, పల్లెవెలుగు:ప్రజాస్వామ్యంలో రెడ్ల రాజ్యం…. ఇంకెంత కాలం…. బీసీలు కూడా రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు ఆదోని కూటమి (బీజేపీ–జనసేన–టీడీపీ) అభ్యర్థి డా. పార్థసారధి. బీసీలు బానిసలు కాదని, స్వతంత్రంగా ఆలోచించి… రాజకీయంగా.. సామాజికంగా… ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఇందుకు ఒక ఏనుగు కథను ఉదాహరణగా చెబుతూ…. ప్రజలను ఆకట్టుకున్నారు. బుధవారం ఆదోని మండలంలోని చిన్నహరివాణం, గోనెల గ్రామాల్లో కూటమి నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ… బీసీలు ఓట్లు వేస్తేనే… సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడని, మీరు ఓటేస్తేనే .. ఆయన అధికారంలో ఉండి .. ఎవరు ఎక్కడ ఉండాలో శాసించాడని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తారని చెప్పిన డా. పార్థసారధి…. బీసీల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారన్నారు.
సమస్యలన్నీ పరిష్కరిస్తా…
ఎన్నికల్లో తనను గెలిపిస్తే…. గ్రామస్తులు కోరిన విధంగా రోడ్లు వేయిస్తానని, బస్సు సౌకర్యం, కేజీబీవీ స్కూల్ ఏర్పాటు చేస్తానని, తాగు,సాగునీరు సౌకర్యం కల్పిస్తానని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి ప్రజలకు హామీ ఇచ్చారు. కమలం గుర్తుకు ఓటు వేసి… వేయించి తనను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అంతకు ముందు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన ఇన్చార్జ్ మల్లప్ప తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.