PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవసరం లేని చోట్ల రోడ్డు వేస్తే ఎలా..

1 min read

-ప్రభుత్వ స్థలాల్లో బోర్డు ఏర్పాటు చేయండి-అధికారులపై ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అవసరం ఉన్న చోట రోడ్డు వేయకుండా అవసరం లేని చోట రోడ్డు ఎలా వేస్తారని మున్సిపాలిటీ అధికారులపై నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని 16వ వార్డులో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వాటిని ఎమ్మెల్యే మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి పరిశీలించారు.వార్డులో రోడ్డు పైన బిల్కు వేశారు ఇక్కడ సిమెంటు రోడ్డు అవసరం ఇక్కడ కాకుండా వేరేచోట అవసరం లేని చోట సిమెంట్ రోడ్డు ఎందుకు వేశారు అక్కడ వేసిన నిధులతోనే ఇక్కడ సిమెంటు రోడ్డు ఎందుకు వేయలేదని ఈ రహదారి బాగాలేదు ఎవరూ అడిగేవారు లేరనే కదా మీరు ఇష్టాను సారంగా రోడ్లు వేశారు అంటూ పట్టణ ఇన్చార్జి ఏఈ మనోజ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఏఈ సమాధానాలు చెప్పలేకపోయారు.టౌన్ ప్లానింగ్ అధికారి బాల మద్దయ్యను ఫోన్ ద్వారా పిలిపించారు.తర్వాత ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వాటిని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న ముళ్ళ పొదలను ఈరోజు శుక్రవారం సాయంత్రం లోపు తొలగించి ‘ఈ స్థలం ప్రభుత్వ భూమి’అని బోర్డు రాయించి పెట్టాలని టిపిఓ ను ఎమ్మెల్యే ఆదేశించారు.ప్రభుత్వ స్థలాలను ఎవరూ కూడా కబ్జా చేయడానికి వీలు లేదు కబ్జా చేసినట్లయితే ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని వారి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాబోయే రోజుల్లో పట్టణం అభివృద్ధి చెందడానికి ఏ ప్రభుత్వ స్థలాలు ఉపయోగ పడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపాలిటీ కౌన్సిలర్ రబ్బాని,2వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్,పలుచాని మహేశ్వర్ రెడ్డి,టిడిపి పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, జమీల్,మున్సిపాలిటీ ఆర్వో విజయలక్ష్మి,రసూల్,రాజన్న తదితరులు పాల్గొన్నారు.

About Author