మానవ సేవే మాధవ సేవా…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నేడు కర్నూల్ నగరంలో వెంకటరమణ కాలనీ నందు సేవా సమితి సభ్యులు పాల్గొని మానవతా స్వచ్ఛంద సేవ ద్వారా రాబోయే నూతన సంవత్సరంలో చేయవలసిన కార్యక్రమాలను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్లాలని జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి తెలిపారు.ఈ సంస్థ ద్వారా ఎవరైనా వ్యక్తి మరణించిన వారి వివరాలు సంస్థకు తెలియజేస్తే ఫ్రీజర్ బాక్స్ ,వైకుంఠ రథం వంటి ఏర్పాటు చేసి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిస్తూ ఇస్తూ ఆ మరణించిన వ్యక్తి అవయవాలు దానం చేయడం ద్వారా మరో వ్యక్తికి జీవం పోయడం అవుతుంది ఈ వార్షిక సంవత్సరంలో సంస్థ ద్వారా చేసిన సేవ కార్యక్రమాలు, సంస్థలో జమ ఖర్చులను సభ్యులందరికీ తెలియజేశారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 30 మంది వ్యక్తులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పాటిల్ హనుమంత్ రెడ్డి, అధ్యక్షులు శోభన్ బాబు, యుగంధర్ శెట్టి, శేషయ్య, స్పందన సురేష్, డాక్టర్ గోవింద్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, మానవతా సేవా సభ్యులు పాల్గొన్నారు.