మానవతావాది డా. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు
1 min readడా. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు ఘనంగా సన్మానించిన. వై ఎఫ్ సి. సభ్యులు
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు: పట్టణంలో… స్థానిక జూనియర్ కళాశాల ఫుట్ బాల్ గ్రౌండ్ నందు మానవతావాది, సమాజ సేవకుడు, మల్లెల గ్రూప్స్ అధినేత, డా.మల్లెల ఆల్ ఫ్రేడ్ రాజు ని శనివారం ఎమ్మిగనూరు ఫుట్ బాల్ క్లబ్ తరఫున ఘనంగా సన్మానించి అభిమానం చాటుకున్నారు. డా. మల్లెల ఆల్ఫ్రెడ్ రాజుఇటీవల విజయవాడలో వరదలు సంభవించిన కారణంగా మన ఎమ్మిగనూరు నుండి సేవా దృక్పథంతో దాదాపు 10 లక్షలు విలువ చేసే దుప్పట్లు,ఆహార పదార్థాలు, మరియు వస్తు సామాగ్రి వంటి ఎన్నో పరికరాలను వరద బాధితులకు అందజేసి మరొకసారి ఎమ్మిగనూరు నుండి మానవత్వం చాటుకున్నందుకు ఎమ్మిగనూరు ఫుట్ బాల్ క్లబ్ తరుపున మల్లెల అల్ఫ్రేడ్ రాజుని ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మల్లెల ఆల్ ఫ్రే డ్ రాజు గత 40 సంవత్సరముల నుండి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ… కులం,మతం, వర్గం లేకుండా పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుస్తున్న గొప్ప మానవతా వాది అని ఆపదలో రక్తదానం, పేద విద్యార్థులకు ఫీజులు చెల్లింపులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటూ, 100కు పైగా కులాంతర వివాహాలు జరిపి ఎందరికో అండగా నిలిచిన వ్యక్తి అని గత కొన్ని ఏళ్ల క్రితం సునామి వచ్చినప్పుడు, 2009 లో తుంగభద్ర నది వరదలు సంభవించినప్పుడు, చెన్నై, కేరళ ,విజయవాడ వరద బాధితులకు ప్రాంతీయ భేదం లేకుండా సహాయం చేయడంలో ముందుండి ఎమ్మిగనూరు ప్రాంతానికి పేరు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కిందని విద్య ,వైద్య రంగాలను ప్రాధాన్యత తీసుకొని, వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… పాదయాత్ర చేసిన ఘనత ఆల్ ఫ్రైడ్ రాజు కు దక్కిందని కొనియాడారు. ఆయన మతం, ఆయన తత్వం, మానవత్వం కావడం పూర్వ జన్మ సుకృతం ఆన్నారు.ఈ కార్యక్రమంలో. వై ఎఫ్ సి. సీనియర్లు ప్రసాద్, విక్రమ్,ముని, రఘు, ఈరన్న,శ్రీనివాసులు, శ్రీరామ్, చాంద్, జి.సి.ఈరన్న, నసరుల్లా భేగ్ మరియు క్రీడాకారులు అదేవిధంగా మల్లెల గ్రూప్ సభ్యులు జడ రవి మాదిగ, న్యూ లైఫ్ సామెలు, సతీష్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమైనది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.