విహెచ్పి ఆధ్వర్యంలో జనవరి 5 న హైందవ శంఖారావం..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: హిందూ దేవాలయాల స్వయంప్రతిపత్తి కోరుతూ….విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో 5 వతేది జనవరి 2025 రోజున ” హైందవ శంఖారావం” పేరుతో విజయవాడ మహానగరంలో “భారీ బహిరంగ సభ” ఏర్పాటు చేయడం జరుగుతున్నదని ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ కర్నూలు కార్యాలయం లో ఉదయం 9:00 గం.ల నుండి 1:00 గం.ల వరకు జరిగిన “వివిధ క్షేత్ర సమావేశం”లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత(రాష్ట్ర)కార్యవాహ మాన్య శ్రీ వేణుగోపాల్ నాయుడు అన్నారు. ఇంకా మాట్లాడుతూ దేశంలో ఉన్న లౌకిక రాజ్యంలో అన్నిమతాలను సమానంగా చూడాలన్న భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాల రాస్తూ గత భారత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం “హిందూ సమాజాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి, ప్రార్థనా స్థలాలు,ఆస్తుల విషయంలో ఇతర మతాలకు విపరీతమైన స్వేచ్ఛను ఇస్తూ…అదేసమయంలో అత్యధిక వర్గానికి చెందిన హిందువుల దేవాలయాలపై మాత్రమే ప్రభుత్వం నియంత్రణ ఉండటం తీవ్రమైన ఆక్షేపణీయమని ఎట్టిపరిస్థితుల్లో హిందూ దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ పూర్తిగా తొలగించేంత వరకు ఈ ఉద్యమం ఆగదని తెలియజేశారు.విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం కో కన్వీనర్ యర్రం విష్ణువర్ధన్ రెడ్డి,నంద్యాల మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి గ్రామ గ్రామాల నుండి హిందూ బంధువులను “హైందవ శంఖారావం” బహిరంగ సభకు వచ్చేలా కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ కార్యవాహ రఘువీర్, జిల్లా సంఘచాలక్ యన్.వి.యస్.గుప్త, జిల్లా కార్యవాహ చంద్ర శేఖర్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి ప్రాణేష్, భా.జా.పా. ఆదోని శాసన సభ్యులు పార్థసారధి,జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠం, విశ్వ హిందూ పరిషత్ కర్నూలు,ఆదోనిజిల్లాల అధ్యక్షులు టి.సీ.మద్దిలేటి, బసవనగౌడ్,కార్యదర్శులు మాళిగి భానుప్రకాష్,హనుమంత రెడ్డి, ఆపస్ సత్యనారాయణ , ధర్మ జాగరణ జోగయ్యశర్మ, ఈపూరి నాగరిజు,గూడూరు గిరిబాబు, వివిధ క్షేత్ర కార్యకర్తలు పాల్గొన్నారు.