ప్రజాసేవకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను
1 min readసాంకేతిక లోపంతో నిలిచిన
యుద్ధ ప్రాతిపదికన …డీసీఎం వ్యాన్ ఏర్పాటు
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేసిన భక్త బృందం, చిన్నారులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలం మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం మొండూరు గ్రామానికి చెందిన సుమారు 50మంది మహిళలు, చిన్నారులతో కూడిన భక్త బృందం పాల్గొని కోలాటం నిర్వహించారు. కోలాటం అనంతరం తిరిగి స్వగ్రామం అయినా మొండూరు వస్తుండగా కామవరపు కోట సమీపంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ సాంకేతిక లోపంతో నిలిచి పోయింది – 2గంటల సమయం పైగా వేచి చూచిన వారికి ప్రత్యామ్నాయం దొరకలేదు. అయితే అదే సమయంలో జంగారెడ్డి గూడెంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రహదారిపై ఎండలో నిలుచుని ఉన్న చిన్నారులను చూసి వెంటనే తమ వాహనాన్ని ఆపారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ, స్వయంగా వారికి చాక్లెట్లు అందించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వాహనం విషయం తెలుసుకుని రహదారిపై ఇబ్బంది పడుతున్నా చిన్నారులను, మహిళలను వారి స్వగ్రామానికి తరలించేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని తన అనుచరులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో హుటాహుటిన డిసిఎం వ్యాన్ ను తెప్పించి చిన్నారులను, మహిళలను క్షేమంగా వారి స్వగ్రామం చేరేలా చర్యలు చేపట్టారు. కోలాటం బృందం తమ స్వగ్రామానికి క్షేమంగా చేరే వరకు వారికి అండగా ఉండేలా తన అనుచరులను సైతం వారికి తోడుగా పంపించారు. ఈ సందర్భంగా తమ అవసరాన్ని గుర్తించి అడగకుండానే నేను ఉన్నాను అంటూ అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు చిన్నారులు, మహిళలూ కృతఙ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేతో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ ఉన్నారు.