అధైర్య పడొద్దు అందరికీ అండగా ఉంటా… శిల్పా
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నందు శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి అధ్యక్షతన నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని ఎవరు అధైర్య పడద్దని అందరికీ అండగా ఉంటానని తెలియజేశారు. అధికార పార్టీకి ఆరు నెలల సమయం ఇచ్చి వేచి చూద్దామని తెలిపారు. వైయస్సార్సీపి పార్టీ కార్యకర్తలను ఎంత బెదిరించిన ఎవరు భయపడరని గుర్తు చేశారు. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడడం సరైనది కాదని ప్రజాస్వామ్యంలో గెలుకోటములు సహజమేనని అన్నారు. ఆర్యవైశ్య నాయకుడు పువ్వాడి భాస్కర్ పై దాడి చేయడాన్ని ఖండించారు.ఈ కార్యక్రమంలో మోమిన్.అహ్మద్ హుస్సేన్ ఆత్మకూరు మండలం మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.