PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోపణలను రుజువు చేస్తే నా యావదాస్తి ని చంద్రబాబుకి రాసిస్తా..

1 min read

చింతమనేనికి సవాల్ విసిరిన కొల్లేరు నేత మోరు రామరాజు

నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తా

తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : చింతమనేని తనపై చేసిన నిరూపణలేని ఆరోపణలను రుజువు చేస్తే తనకున్న యావదాస్తిని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకి రాసిచ్చేస్తా నని అలాగే తనపై భూమి ఆక్రమించుకున్నాడని చేసిన ఆరోపణలను చింతమనేని రుజువు చేయలేకపోతే చింతమనేని కూడా తన ఆస్తి మొత్తాన్ని చంద్రబాబుకి రాసిస్తాడా అంటూ కొల్లేరు ప్రాంత నాయకులు, ప్రముఖ బీసీ నేత,  వైఎస్ఆర్ సీపీ నాయకులు మోరు రామరాజు సవాల్ విసిరారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామస్తుడు మోరు రామరాజు పై సోమవారం కలక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో చేసిన పిర్యాదు పై మోరు రామరాజు మంగళవారం ఘాటుగా స్పందించారు. కొందరితో కలిసి చింతమనేని తనపై ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. వడ్డిగూడెం గ్రామంలో సర్వే నంబర్ 190 లో సుమారు 12 ఎకరాల 18 సెంట్ల భూమి అక్రమంగా ఆక్రమించుకున్నానని చింతమనేని చేసిన నిరూపణలేని ఆరోపణలను రుజువు చేస్తే తనకున్న యావదాస్తిని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకి రాసిచ్చేస్తా నని అలాగే నాపై భూమి ఆక్ర మించుకున్నానని చింతమనేని రుజువు చేయలేకపోతే చింతమనేని కూడా తన ఆస్తి మొత్తాన్ని చంద్రబాబుకి రాసిస్తాడా అంటూ చింతమనేనికి మోరు రామరాజు మీడియా సాక్షిగా ఛాలెంజ్ విసిరారు. మంగళవారం సాయంత్రం స్థానిక కట్టా సుబ్బారావు తోట అయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కొల్లేరు బీసీ నాయకులుమోరు రామరాజు మాట్లాడుతూ వడ్డీగూడెం గ్రామంలో 12 ఎకరాల 18 సెంట్లు భూమిని గ్రామస్తుల అవసరార్థం బయటి వ్యక్తుల వద్ద అప్పు తీసుకుని ఎకరం 1లక్షా 18 వేల రూపాయల చొప్పున 12 ఎకరాల 18 సెంట్లు భూమిని తనతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల పేరున 17/6/2002 లో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కోటగిరి విద్యాధరరావు సమక్షంలో కొనుగోలు చేసి రిజిస్టర్ చేయబడి ఆ భూమిలో చేపల చెరువు తవ్వించి గ్రామ ప్రజలకు ఆదాయం కల్పించామని రామరాజు అన్నారు. ఆ చెరువును పూడ్చడానికి చింతమనేనికి సంబంధం ఏమిటని రామరాజు ప్రశ్నించారు.వడ్డిగూడెం గ్రామంతో పాటు సమాజంలో పరువు ప్రతిష్టలతో జీవిస్తున్న తన వ్యక్తిత్వా నికి తన కుటుంబ పరువుకు భంగం కలిగేలా తన పై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తోపాటు మరో 12మంది ఆయన అనుచరులతో నాపై విడి విడిగా ఫిర్యాదులు చేసిన వ్యక్తుల పై డిపర్ మేషన్ షూట్ (పరువు నష్టం దావా) వేస్తానని రామరాజు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో చింతమనేనిని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని రామరాజు హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను వైఎస్ఆర్సిపి తరఫున ప్రచారం చేసినందు వల్ల కక్షగట్టి తనను ప్రజల ముందు, అధికారుల ముందు కించపరచడానికి అవమానించడానికి చింతమనేని కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. చింతమనేని పై తాను మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. చింతమనేని తాటాకు చప్పట్లకు తాను బెదిరేది లేదన్నారు. కొల్లేటిలో ఆయన ఆగడాలు చెల్లబోవని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కొన్న 12 ఎకరాల 18 సెంట్లు భూమిపై చింతమనేని పెత్తనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను, తన గ్రామస్తులు కలిసి ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటామన్నారు. ఆ భూమికి సంబంధించిన జిఎస్టి, రిజిస్ట్రేషన్ ఖర్చులను లబ్ధిదారులు భరించినట్లయితే వారికి అప్పగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వడ్డిగూడెం గ్రామంలో తన పట్టా భూముల్లో ఉన్న చేపల చెరువులో మేతలు కూడా వేయనీయకుండా లీజుదారు లను చింతమనేని అడ్డుకోవడం పై రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీని పై తనకు రక్షణ కల్పించి  న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కి జిల్లా పోలీసు అధికారులకు పిర్యాదు చేశానని కొల్లేరు నేతమోరు రామరాజు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *