ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి చూపకపోతే చర్యలు తప్పవు
1 min readఆర్డీవోలు, స్పెషల్ ఆఫీసర్లు,ఎంపిడిఓ లు రోజువారీ హౌసింగ్ పురోగతిపై సమీక్షలు నిర్వహించాలి
100 రోజుల్లో నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలు కచ్చితంగా సాధించాలి
ఉపాధిహామీ పని దినాల కల్పనలో ప్రత్యేక దృష్టి పెట్టాలి
పల్లె పండుగ లో శంకుస్థాపన చేసిన పనులను జనవరి 15వ తేది నాటికి పూర్తి చేయాలి
పి జి ఆర్ ఎస్ కి సంబంధించి ఏ ఒక దరఖాస్తు రీ ఓపెన్, బియాండ్ ఎస్ఎల్ఏ కి వెళ్ళకూడదు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి చూపకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి హౌసింగ్, ఉపాధి హామీ, పిజిఆర్ఎస్ అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల పురోగతిలో వెనుకబడి ఉన్నామని, ప్రస్తుతం వర్షాలు వల్ల తక్కువ పురోగతి ఉండవచ్చని, అయితే వచ్చేవారం నుంచి పురోగతి చూపకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. నిర్మాణాల పురోగతిపై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, హౌసింగ్ డీఈలు, ఏఈ లతో డివిజన్, మండలాల వారీగా కలెక్టర్ లోతుగా సమీక్షించారు.వంద రోజుల్లో నిర్దేశించుకున్న విధంగా ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.హౌసింగ్ విషయంలో ఫోకస్డ్ గా, కో ఆర్డినేషన్ తో వెళితే తప్ప పురోగతి సాధించలేరని కలెక్టర్ పేర్కొన్నారు. 100 రోజుల్లో హౌసింగ్ కి సంబంధించిన లక్ష్యసాధనకు డివిజన్ ల వారీగా కార్యాచరణ ప్రణాళిక ఏంటి అని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలను అడిగి తెలుసుకున్నారు..ఇళ్ళ నిర్మాణాల లక్ష్యంలో ఎక్కువ శాతం ఆదోనిలో ఎక్కువ ఉందని, ప్రత్యేక దృష్టి సారించి ఇళ్ళ నిర్మాణాలను విజయాలని కలెక్టర్ సూచించారు. ఆప్షన్ త్రీ కింద ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్లతో మాట్లాడి త్వరితగతిన ఇళ్ళను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇసుక, సిమెంట్ సమస్యలు ఏమైనా ఉంటే జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని పరిష్కరించుకోవాలన్నారు .రూఫ్ కాస్ట్ లెవెల్ లో ఉన్న ఇళ్లను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.వెల్దుర్తి, తుగ్గలి, కర్నూలు, పెద్దకడబూరు, ఆదోని, నందవరం , కోసిగి, కోడుమూరు, ఎమ్మిగనూరు మండలాల్లో పని దినాలు కల్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ కల్పించలేకపోతున్నారని, పని దినాలు కల్పించడంలో పురోగతి తీసుకొని రావాలని సంబంధిత మండలాల ఎంపిడిఓ లను కలెక్టర్ ఆదేశించారు..హార్టికల్చర్ ప్లాంటేషన్ లో 4, 311 ఎకరాలలో లక్ష్యాలకు గాను 3 వేల 400 ఎకరాలు పూర్తి చేశారని , లక్ష్యాలను కూడా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.పిజిఆర్ఎస్ కు సంబంధించి మన జిల్లాలో జూన్ 15వ తేది నుంచి ఇప్పటి వరకు మొత్తం 4658 అర్జీలు వచ్చాయని, అందులో 3549 వాటిని పరిష్కరించడం జరిగిందని వీటిలో 3427 సరైన సమయంలో పరిష్కరించారని అయితే 122 మాత్రం బియాండ్ ఎస్ఎల్ఎలో ఉన్నాయన్నారు. బియాండ్ ఎస్ఎల్ఎ లోవరకు ఎందుకు వెళుతున్నారు అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు.. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పరిష్కరించిన దరఖాస్తుల్లో 8% దరఖాస్తులు రీఓపెన్ చేయడం జరిగిందని, వీటిని పై స్థాయి అధికారులు వెరిఫై చేసి వారి ఎండార్స్మెంట్ ను కూడా అప్లోడ్ చేయాలన్నారు. రీ ఓపెన్ కు గాని, బియాండ్ ఎస్ఎల్ఎ కు కానీ వెళ్ళకుండా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.. ఇప్పటికీ 0.2 శాతం ఇంకా చూడని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వచ్చిన పిటిషన్స్ వెంటనే ఓపెన్ చేసి చూడాలని కలెక్టర్ ఆదేశించారు.పల్లె పండుగ కి సంబంధించి సీసీ రోడ్లు, బిటి రోడ్లు, గోకులంలు నిర్మాణాల పనులకు మంజూరు చేశామని, ఎంపీడీవోలు పంచాయతీరాజ్ ఏఈ లతో సమీక్ష నిర్వహించుకుని జనవరి లోపు పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవా లని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చిరంజీవి, జెడ్పి సీఈఓ నాసరరెడ్డి, హౌసింగ్ పీడీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.