ప్రాణ శక్తి ఉంటే బ్రతుకుడు లేకపోతే సచ్చుడు…
1 min readడా. మాకాల సత్యనారాయణ
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ప్రాణ శక్తి ఉంటే బ్రతుకుడు లేకపోతే చనిపోతారని డా. మాకాల సత్యనారాయణ తెలిపాడు. ప్రాణ శక్తి సున్నా అయితే చావు, 1% ప్రాణశక్తి ఉంటే ముక్కు దగ్గర, నాడి దగ్గర కదలిక వుంటుందని,ప్రాణశక్తి 3% ఉంటే మంచం మీద కదలిక వుంటుందని తెలిపారు. అదే 5% వుంటే మంచం దిగ గలుగుతారని,10% ఉంటే నడవగలుగు తారని, 20% పైన ఉంటే 4 అంతస్థులు ఎక్కిదిగ గలుగుతారని, 30% ఉంటే 10 కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతారని, 40% ఉంటే రోజంత ఆనందంగా పనిచేయగలుగుతారని, 50% ఉన్న వ్యక్తి ఇప్పటి 4 గురు పనిచేయగలుగుతారని చెప్పారు. అదే 60% ప్రాణ శక్తి వున్న వ్యక్తి 50 కేజీల బస్తా 25 కిలో మీటర్లు తీసుకువెళ్లి రాగలుగుతారని తెలిపారు.60% ప్రాణశక్తి వుండే వ్యక్తులు ఒకప్పుడు వుండే వారిని ఇప్పుడు వాళ్ళు గతించారని తెలిపారు దీనిని బట్టి రానురాను ప్రాణ శక్తి మనుషులలో సన్నగిల్లి రోగాలు, రుగ్మతలు పెరిగినాయి మరియ ఆయుష్యగణనీయంగా తగ్గుతుందని తెలిపారు.భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ప్రాణశక్తి పెంచుకోవడం ఆరోగ్యంగా, ఆనందంగా, సమర్థవంతంగా పని చేయగలుగుతున్నారు. దానికోసం ప్రాణ శక్తి మార్గాలను ఆచరిస్తున్నాట్లు తన ఫిట్ నెస్ మంత్ర ద్వారా అందరికి తెలియజేయడం గమనార్హం. అలాంటి ప్రాణశక్తిమార్గాలను విజయవాడ అశోక్ నగర్ లోని యోగశక్తి సాధనా సమితి 7 రోజుల శిక్షణా కార్యక్రమం అందరికి అందేలాగ ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 4వ తేదీనుండి 10వ తేదివరకు ప్రాణశక్తి పెంపుపై శిక్షణ కార్యక్రమములో పాల్గొని దీర్ఘకాల రుగ్మతలను తగ్గించుకోవలసిందిగా యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డా. మాకాల సత్యనారాయణ కోరుతున్నారు. ఈ కార్యక్రములో పాల్గొనదలచినవారు సెల్ నెంబరు 9000347369 ను సంప్రదించవలసినదిగా కోరుచున్నారు.