పేదలను విస్మరిస్తే ఉద్యమిస్తాం…. సిపిఐ
1 min readపేదలు నివాసం ఉన్న కాలనీల్లో సిసి రోడ్లు వెయ్యకుండా నివాసాలు లేని చోట సీసీ రోడ్లు నిర్మాణమా…
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణ శివారుల్లో ఉన్న దిద్దీసేన్ కాలనీ. వి కె. ఆదినారాయణ రెడ్డి నగర్. పార్వతి కొండ కాలనీలో ఇంటి నెంబర్లు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు జల్జీవన్ పథకం కింద త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో కాలనీలవాసులు పత్తికొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశాన్ని దిగ్బంధించారు.పత్తికొండ పట్టణ శివారులో నివాసమున్న పేదల కాలనీ సి.సి రోడ్లు డ్రైనేజీ కాలువలు నిర్మాణం అలాగే ఇంటి నంబర్లు ఇవ్వాలని నినాదాలు చేస్తూ స్థానిక చదువుల రామయ్య భవన్ నుండి వందలాది మందితో పత్తికొండ గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సర్వసభ్య సమావేశంలోనికి దూసుకుపోయారు. జరుగుతున్న సర్వసభ్య సమావేశాన్ని నిరసనకారులు గంటసేపు దిగ్బంధచారు. ఈ సందర్భంగా సమస్యల పట్ల సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ .మాట్లాడుతూ, పత్తికొండ పట్టణంలో గత 15 సంవత్సరాల కిందట ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేసి నిరుపేదలకు స్థలాలు పంచి ఇచ్చి మూడు కాలనీలను ఏర్పాటు చేశామన్నారు. వీకే ఆదినారాయణ రెడ్డి నగర్. పార్వతి కొండ కాలనీ .దిద్ది సేన్ కాలనీ. ఏర్పాటుచేసి పేద ప్రజలు కొట్టాలేసుకొని గత 15 సంవత్సరాల నుండి అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కరెంటు సౌకర్యం, గ్రామపంచాయతీ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించారని అన్నారు. ప్రభుత్వం కొంతమందికి పట్టాలిచ్చి పక్కా గృహాలు కూడా మంజూర అయ్యాయని అన్నారు. అయితే మూడు కాలనీలలో సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు మరియు జల్ జీవన్ పథకం కింద ఇంట.