PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెట్లను రక్షిస్తే మనల్ని చెట్లు రక్షిస్తాయి

1 min read

ప్రధానోపధ్యాయురాలు భ్రమరాంబ 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  వృక్షో రక్షతి రక్షితః అన్నట్లు మనం చెట్లను రక్షిస్తే చెట్లు మనల్ని రక్షిస్తాయని పత్తికొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రమరాంబ స్పష్టం చేశారు. “శిక్షా సప్తాహ్” కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు అయిన శనివారం పతికొండ పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో  ప్రధానోపధ్యాయురాలు భ్రమరాంబ ఆధ్వర్యంలో “పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు” నిర్వహించారు.ఇందులో భాగంగా పాఠ శాల ఆవరణంలో వివిధ రకాల మొక్కలను నాటడం జరిగింది.విద్యార్థినిలు ఎకొక్లబ్ యేర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన పూర్వీకులు వృక్షో రక్షతి రక్షితః అన్నారు.ఎందుకంటే మనం మన పరిసరాలలోను,ఆవరణంలోనూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం వలన అవి వృక్షాలుగా ఎదిగి పర్యావరణకాలుష్యమును తగ్గించి గాలిని శుభ్రం చేసి మనకు స్వచ్చమైన ఆక్సిజన్ విడుదల చేస్తాయని  తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు దోహదం చేస్తుందని అన్నారు.చెట్లు పెంచడం ద్వారా భూగర్భ జలాల రీఛార్జ్ మరియు శుద్దీకరణలో సహాయపడతాయి అని వివరించారు.వన్య ప్రాణులకు ఆవాసాలుగా ఉంటాయనీ అన్నారు.మనకు అనేక రకాల ఫలాలతో పాటు ఔషదాలను తయారికి ఉపయోగ పడతాయనీ అన్నారు.చల్లని నీడనిస్తూ మనకు అనేక విధాలుగా చెట్లు ఉపయోగ పడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

About Author