PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దమ్ముంటే అభివృద్ధి పై చర్చకు రండి..

1 min read

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి.డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు సవాల్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  వైకాపా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మహేష్ యాదవ్ పై నాన్ లోకల్ అని నేను లోకల్ అని పదే పదే ప్రస్తావిస్తున్నారని   మీరు ఎంపీ అయితే ఈ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఏమి చేస్తారో మీ ప్రణాళిక ఏమి రూపొందించారో చెప్పకుండా ప్రత్యర్థిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం మీ దిగజారుడు తనానికి నిదర్శనం అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ధ్వజమెత్తారు. ఏలూరు కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీకు దమ్ముంటే గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దానికి మా ఎంపీ అభ్యర్థి అవసరం లేదని నేను చాలని అన్నారు. ఎప్పుడు ఎక్కడ అనేది మీరు చెప్పిన లేదా నన్ను చెప్పమన్న సిద్ధమని అని అన్నారు. మీ తండ్రి మంత్రిగా ఉండి జిల్లాకు ఒరగబెట్టింది ఏమి లేదని టీడీఆర్ బాండ్ల కుంభకోణంతో వందలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన సంగతి ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. ఆరుగాలం కష్టపడిన రైతు గోను సంచులు అడిగితే దేశానికి అన్నం పెట్టె రైతును ఎర్రిపప్ప అని తిట్టిన ఘనత మీదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు,  నిర్వాసితులుకు ఏమి చేసారు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, పామాయిల్, పొగాకు, వరి రైతులకోసం ఏమైనా చేసారా ఈ ప్రభుత్వహయాంలో అని అన్నారు. ఇక్కడ మీ పార్టీలో ప్రభుత్వంలో ఏ ఒక్కడు సరైన నాయకుడు లేడు అనా ఎక్కడో ఉన్న మిథున్ రెడ్డికి బాధ్యత అప్పజెప్పి అతని దగ్గర మొకరిల్లుతున్నారని అన్నారు.ఎమ్మెల్యే, ఎంపీలకు ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన మీరా లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడేది అని అన్నారు. మా కూటమి అభ్యర్థి ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని, ఉన్నత విద్యావంతుడు అని మంచి వ్యాపారవేత్త అని నిజాయితీగా సంపాదించి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారని మీకుల అవినీతి సంపాదన చేసి వచ్చిన వాళ్ళు కాదని అన్నారు. మీకు దమ్ముంటే అభివృద్ధి పై మాట్లాడండి అంతేకాని ఇంకోసారి ఇలా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. ఈకార్యక్రమంలో బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబొయిన రామలింగేశ్వరరావు, చింతలపూడి మీడియా కన్వీనర్ చెరుకూరి శ్రీధర్, చింతలపూడి మండల అధ్యక్షుడు మాటూరి వెంకట్రామయ్య, ఏలూరు జిల్లా బీసీసెల్ అధికార ప్రతినిధి పిల్లల శ్రీనివాస్ యాదవ్, లింగపాలెం ప్రధానకార్యదర్శి చెన్నూ శ్రీనివాస్ యాదవ్, జంగారెడ్డిగూడెం మండల ఎస్సిసెల్ అధికార ప్రతినిధి తాళ్లూరి వెంకటేశ్వరరావు, పార్టీ కార్యాలయ సహాయకుడు అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.

About Author