చెడు చేస్తే సమాజానికి కీడు జరుగుతుంది… డిఎస్పీ సమావేశం
1 min readడిఎస్పి రామాంజి నాయక్.
పలెవెలుగు వెబ్ వెలుగోడు: చెడు చేస్తే సమాజానికి కీడు జరుగుతుందని ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ పేర్కొన్నారు. వెలుగోడు పట్టణంలోని సాయిబాబా గుడి సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం ఎస్సై విష్ణు నారాయణ అధ్యక్షతన జరిగింది. డి.ఎస్.పి మాట్లాడుతూ మూడు రోజులు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పూజలు నిర్వహించుకోవాలని అన్నారు. వినాయక మండపాల వద్ద ఐదు మంది కమిటీ సభ్యులు రాత్రి , పగలు బాధ్యతగా ఉండాలని అన్నారు. డీజే లకు అనుమతి లేదని, త్రాగుడుకు యువకులు బానిసలు కావద్దని హెచ్చరించారు. ప్రతి విగ్రహానికి క్యూ ఆర్ కోడ్ కేటాయిస్తామని, శాంతియుతంగా, సాంప్రదాయ బద్ధంగా, సమన్వయము పాటించి జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస గౌడ్, శాంతి కమిటీ సభ్యులు, విగ్రహ మండపం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.