నకిలీ విత్తనాలు..అమ్మితే సహించేది లేదు
1 min readఆరు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రణాళికలు
మీలో ఒకడిగా..మీ మధ్యన తిరగాలనేదే నా తపన
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే పంపిణీ చేయాలని కానీ నకిలీ విత్తనాలు అమ్మితే సహించే ప్రసక్తే లేదని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శనివారం మధ్యాహ్నం నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తనాలు ఎరువులు పురుగుల మందు డీలర్ల సమావేశానికి ఎమ్మెల్యే హాజరు కాగా ఎమ్మెల్యేకు ఎంఏవో షేక్షావలి రెండవ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మరియు సిబ్బంది ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్షావలికి ఉత్తమ అవార్డు రావడం పట్ల ఏవో ను ఎమ్మెల్యే అభినందించారు. తర్వాత రైతులకు నాన్న మీద విత్తనాలు మందులు డీలర్లు అందించాలని రైతులందరూ పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలనేదే నా ఉద్దేశమన్నారు.నేను ఎమ్మెల్యేను మీలో ఒకడిగా తిరగాలనేదే నా తపన అని ప్రతి ఒక్కరూ కూడా క్రింది స్థాయి నుంచి వచ్చిన వారేనని రైతులకు ప్రభుత్వాలు ఇస్తున్న వాటిని వారికి అందించే విధంగా మీరు ఉండాలని గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఏ ఒక్క సబ్సిడీ లేదు.మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతుకు సబ్సిడీ ద్వారా అందిస్తున్నామని నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారి పైన తగు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అల్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 6 ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.ఈ కార్యక్రమంలో 1వ వార్డ్ కౌన్సిలర్ చిన్నరాజు,పట్టణ టిడిపి నాయకులు,ఎస్ఎండీ జమీల్ బాష,రసూల్ ఖాన్, వ్యవసాయ అధికారులు మరియు డీలర్లు పాల్గొన్నారు.