PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కష్టపడితే ఏ రంగంలోనైనా మంచి ఫలితాలు సాధించవచ్చు..ఎంపి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కష్టపడితే ఏ రంగంలోనైనా మంచి ఫలితాలు సాధించవచ్చని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు..నగరంలోని కే.వి.ఆర్ ప్రభుత్వ బాలికల కళాశాల, మరియు టౌన్ మోడల్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ఉచిత నోట్ బుక్కులు , బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యార్థులకు బుక్కులు, బ్యాగులు అందజేశారు.. ఈ సంధర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎం.పి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న తాను ఎంతో కష్టపడి ఎం.పిని అయ్యానని, మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాటిని సాధించేందుకు శ్రమించాలన్నారు.. ఇక బాగా చదువుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.. ఈ కార్యక్రమంలో  కె.వి.ఆర్, టౌన్ మోడల్ కళాశాలల ప్రిన్సిపళ్లు లాలేప్ప, సుంకన్నల తోపాటు లెక్చరర్లు పాల్గొన్నారు.

About Author