PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూట్ మిల్ కార్మికుడు కుటుంబాన్ని పరామర్శించిన  ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు

1 min read

కుటుంబ పెద్దన కోల్పోవడం బాధాకరం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగరానికి చెందిన జూట్ మిల్ కార్మికుడు ఇమ్మంది దుర్గారావు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దుర్గారావు కు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలిసిన ఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు ప్రసాద్(ఇఫ్ట్ ప్రసాద్) ఏలూరు నగరానికి విచ్చేసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో తనకున్న చిరకాల అనుబంధాన్ని గుర్తుచేసుకొని కంటతడి పెట్టారు. కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని. దుర్గారావు భార్య అన్నపూర్ణమ్మ ను, ఆయన కుమారుడు కళ్యాణ్ ను ధైర్యంగా ఉండాలని పార్టీ అన్ని విదాలుగా అండగా ఉంటుందని ఓదార్చారు. రాష్ట్ర నాయకులు ప్రసాద్ మా ఇంటికి రావడం. పేరుపేరునా కుటుంబ అందర్నీ ఆప్యాయంగా పలకరించడం తో ఆశ్చర్యం ఆనందం కలిగిందని అన్నారు. నా కుటుంబ సభ్యులందరినీ పలకరించి మా కుటుంబం పట్ల ఎంతో ప్రేమ చూపించిన ప్రసాద్ కి కుమారుడు కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author