PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బస్టాండ్ పక్కన అక్రమ కట్టడాలను తొలగించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండల పరిధిలోని గజ్జహల్లి గ్రామంలో బస్టాండ్ పక్కన అక్రమ కట్టడాలను తొలగించాలని గజ్జహల్లి గ్రామస్తులు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గజ్జహల్లి గ్రామంలో బస్టాండ్ చిన్నదిగా ఉండడం వలన బస్టాండ్ పక్కన ఒక కులానికి సంబంధించిన వారు విగ్రహాలను ప్రతిష్టించేందుకు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఈ విధమైన అక్రమ నిర్మాణం వల్ల గ్రామంలో కులమతాలకు సంబంధించిన విగ్రహాలు మరియు బోర్డు లాంటి నిర్మాణాలు చేపట్టడం వల్ల కులమతలో వర్గ పోరు ఏర్పడుతుందని గజ్జహాల్లి గ్రామ ప్రజలు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే జారీ చేయబడిన జీవో ఎంఎస్ నెంబర్ 18 ఆర్ అండ్ బి 18/02/2013 ప్రకారం అన్ని పబ్లిక్ రోడ్డు పక్కన ఏ విధమైన విగ్రహాలు ఏర్పాటు చేయుటకు, నిర్మాణం చేపట్టేందుకు అనుమతి ఇవ్వరాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. అయినా కూడా బస్టాండ్ పక్కన ఉన్న పబ్లిక్ స్థలంలో అక్రమంగా విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కనుక దీనిపై దృష్టి చూపి వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వేసిన పిల్లర్ని తొలగించి ఊరి నందు శాంతిభద్రతలు కాపాడగలరని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో దస్తగిరి, గోపాల్,చిట్టి,శివలింగ,మల్లయ్య,రాము,శేఖర్,భీమేశ్ పాల్గొన్నారు.

About Author